ఏడాది చివరి రోజున స్వల్ప నష్టాలతో స్టాక్ మార్కెట్ సూచీలు 3 d ago
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ ఏడాది చివరి రోజున స్వల్ప నష్టాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల నడుమ రోజంతా నష్టాల్లో కదలాడాయి. ఇంట్రాడేలో 77,982.57 వద్ద కనిష్టాన్ని తాకీ చివరకి 109.12 పాయింట్ల నష్టంతో 78,139.01 వద్ద ముగిసింది. నిఫ్టీ కేవలం 0.10 పాయింట్ నష్టంతో 23,644. 80 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 13 పైసలు క్షీణించి 85.65గా వుంది.